‘భౌతిక దూరం పాటిస్తే మద్యం షాపులు తెరుస్తాం’

భౌతికదూరం నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తే రాష్ట్రంలో మద్యం షాపులను తెరవడానికి అనుమతిస్తామని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోప్‌ వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడానికి, ఉపాధి కల్పించడానికి రాష్ట్రంలో డిస్టిలరీ నుంచి వైన్‌ షాపుల వరకు విడతలవారీగా వ్యాపారం ప్రారంభించడానికి అనుమతించాలని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆల్కహాలిక్‌ బేవరెజ్‌ కంపెనీస్‌ (సీఐఏబీసీ) సీఎం ఉద్ధవ్‌ థాక్రేను గతవారం కోరింది. దీంతో ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ భౌతిక దూరం నిబంధనలను కచ్చితంగా అమలుచేస్తే వైన్‌ షాపులను తెరవడానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన ప్రభుత్వం పరిమిత సంఖ్యలో వ్యాపారాలను నిర్వహించుకోవడానికి అనుమతించింది