కరోనా వైరస్ ప్రభావం యూపీఐ చెల్లింపులపైనా పడింది. 21 రోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో గత కొన్ని నెలలుగా నిరంతరం పెరుగుతున్న యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్పేస్) చెల్లింపులు మార్చ్ నెలలో పూర్తిగా పడిపోయాయి. యూపీఐ చెల్లింపుల విధానాన్ని ఆర్బీఐ సూచనల మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఇండియా రూపొందించింది. ఇది ఏదైనా బ్యాంకు ఖాతాకు డబ్బును తక్షణమే బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఫిబ్రవరి వరకు 132.57 కోట్ల లావాదేవిలు ఉండగా, మార్చిల్ 124.68 కోట్లకు పడిపోయింది. డిజిటల్ పేమెంట్స్ ప్రారంభం నుంచి ప్రజల్లో ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్‌పై అవగాహన పెరిగి నిరంతరం లావాదేవిలు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా యూపీఐ లావాదేవిలు ప్రతికూల ప్రభావంను ఎదుర్కొంటున్నాయి. ఏప్రిల్, మే నెలలో యూపీఐ లావాదేవిలు మరింత క్షిణించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.