టీఎస్ బీపాస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే చర్యల్లో రాష్ట్ర పురపాలకశాఖ వేగంపెంచింది. ఇందులో భాగంగా కామన్ అప్లికేషన్ ఫారంను సిద్ధంచేసింది. తద్వారా 500 చ.మీ. విస్తీర్ణం, పదిమీటర్ల ఎత్తున్న నిర్మాణాలకు సులువుగా అనుమతులు లభిస్తాయి. వాణిజ్యభవనాలు, బహుళ అంతస్తుల అపార్టుమెంట్లు, అపార్టుమెంట్ కాంప్లెక్సులు, మల్టిప్లెక్స్ థియేటర్లు, నివాసేతర భవనాలకు సులువుగా అనుమతులు, నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు (ఎన్వోసీలు) మంజూరు చేస్తారు. దీనికోసం ప్రతిజిల్లాలో కలెక్టర్ నేతృత్వాన సింగిల్ విండో కమిటీ ఏర్పాటుచేస్తారు. 1,000 చ.మీ. లేదా అంతకంటే అధిక విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు సంబంధించిన దరఖాస్తులు డీటీసీపీ (టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్)కి వెళ్తాయి. ఆయా నిర్మాణాల సాంకేతిక అంశాలను క్షుణ్నంగా పరిశీలించాక స్థానిక మున్సిపల్ కమిషనర్ ద్వారా అనుమతులిస్తారు.
టీఎస్ బీపాస్‌పై కసరత్తు